ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని కౌసర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోఢాహియా గ్రామానికి చెందిన ప్రతాప్‌కు గుల్లన్పుర్వ గ్రామ యువతి పుష్పతో మే 30న వివాహం జరిగింది. ఆ తర్వాత మే 31న వధువుతో కలిసి గ్రామానికి వచ్చాడు వరుడు ప్రతాప్. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లారినా సరే వధూవరులు నిద్ర లేవకపోవడం వల్ల కుటుంబసభ్యులు తలుపు తట్టారు. ఎంతసేపు తట్టినా తలుపు తీయకపోవడం వల్ల అనుమానించి కుటుంబసభ్యులు కిటీకీలోంచి చూడగా ఇద్దరూ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే తలుపులు పగలకొట్టి వెళ్లి చూస్తే విగతజీవులై కనిపించారు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. శవపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే మరణానికి గల కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. గదిలో సమోసాలు, కూల్‌డ్రింక్స్ లభ్యమయ్యాయని తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో నవ వధూవరులు మృతి
June 02, 2023
0
Tags