తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ తండాకు చెందిన బేబీని అశోక్ అనే వ్యక్తి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు బేబీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళింది నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టాడు. అయితే అంతకు ముందు నుంచే భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భార్యను కాపురానికి తీసుకురావడం కోసం ఐదు రోజుల క్రితం అశోకు తన అత్తగారింటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన అశోక్ ను భార్య బేబీ కుటుంబ సభ్యులు కలిసి దూషించారు. నానా మాటలు అని తన కూతురు అత్తింటికి పంపే ప్రశక్తే లేదని చెప్పారు. దీంతో అశోక్ అత్తింటి నుంచి బయటకు వచ్చి భార్యను చూసిన బేబీ తన వైపుకూడా చూడలేదు. ఇక చేసేది ఏమీలేక అశోక్ తన ఇంటికి వెనుతిరిగాడు. ఇంటికి వచ్చిన అశోక్ పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అశోక్ ను గుర్తించిన స్థానికులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అయితే అశోక్ తల్లిదండ్రులు తన కొడుకు చావుకు కారణం అత్త కుటుంబ సభ్యులు అని ఆరోపించారు. ఈ విషయమై మృతుడు తండ్రి రాములు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు భార్యతో పాటు అత్తమామనుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
June 01, 2023
0
Tags