'గోదావరి' సహా 14 రైళ్లు రద్దు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తాడి-అనకాపల్లి మధ్య రాజుపాలెం గేటు వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్సు రైలు నిన్న పట్టాలు తప్పడంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల వేళల్ని రీషెడ్యూల్‌ చేశారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ట్రాక్‌ను మరమ్మతులు చేయడంతో విశాఖ దిశగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728) రైలును 15, 16 తేదీల్లో రద్దు చేసిన అధికారులు, విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు (12727)ను 16, 17 తేదీల్లో రద్దు చేశారు. ఇకపోతే ఈరోజు (15న) విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) మూడు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరనుంది. అలాగే, విజయవాడ-విశాఖపట్నం రైలు (12718), విశాఖ- విజయవాడ(12717) రైళ్ల సేవలను 16వ తేదీన రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ-కడప (17488) రైలును 15, 16 తేదీల్లో రద్దు చేసిన అధికారులు.. కడప నుంచి విశాఖవచ్చే రైలు (17487) సర్వీసులను 16,17 తేదీల్లో రద్దు చేశారు. దీంతో పాటు విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ (12861) రైలును 15, 16 తేదీల్లో; మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం (12862) రైలును 16, 17 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇకపోతే, సికింద్రాబాద్‌-విశాఖ (12740) రైలును 15,16 తేదీల్లో; విశాఖ తిరుపతి రైలు(22707)ను 15న; తిరుపతి విశాఖ (22708) రైలును 16వ తేదీన రద్దు చేశారు. గుంటూరు రాయగడ (17243)రైలును 16, 16 తేదీల్లో; రాయగడ- గుంటూరు (17244)రైలును 16, 17 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఈరోజు విశాఖ నుంచి హైదరాబాద్‌ బయల్దేరే (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌; విశాఖ-విజయవాడ వెళ్లే (12717) రైళ్లు మూడు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)