అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచి, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. విజయం తరువాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 20 కోట్లు ఫ్రైజ్‌మనీ అందుకుంది. గుజరాత్ టైటాన్స్ (రన్నరప్) రూ. 13 కోట్లు, ముంబై ఇండియన్స్ (3వ స్థానం) రూ. 7 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ (4వ స్థానం) రూ. 6.5 కోట్లు అందుకున్నాయి.
మహ్మద్ షమీ (పర్పుల్ క్యాప్) : సీజన్లో (28 వికెట్లు) అత్యధిక వికెట్లు.
శుభ్‌మన్ గిల్ (ఆరెంజ్ క్యాప్) : సీజన్లో (890 పరుగులు) అత్యధిక పరుగులు.
యశస్వీ జైస్వాల్ : ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్.
గ్లెన్ మాక్స్వెల్ : సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (183.48 స్ట్రైక్ రేట్).
శుభ్‌మన్ గిల్ : గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్.
ఢిల్లీ క్యాపిటల్స్ : పేటీఎం ఫెయిర్ ప్లే అవార్డు
రషీద్ ఖాన్ : క్యాచ్ ఆఫ్ సీజన్
శుభ్‌మన్ గిల్ : అత్యంత విలువైన ఆటగాడు
శుభ్‌మన్ గిల్ : సీజన్‌లోని అత్యధిక ఫోర్లు (85)
ఫాఫ్ డు ప్లెసిస్ : సీజన్ లో పొడవైన సిక్స్ (115 మీటర్లు)
సీజన్ యొక్క ఉత్తమ వేదిక : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (50లక్షలు)