నాలుగు రోజులపాటు వర్షాలు !

Telugu Lo Computer
0


తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మొదటి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆ తర్వాత రెండు రోజులు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని బులెటిన్​లో వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్ సిటీలోనూ వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ నాలుగు రోజుల పాటు మబ్బులు పట్టే అవకాశం ఉందని, తేలికపాటి జల్లులు కురవొచ్చని పేర్కొంది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా సర్ధానలో 1.5, కామారెడ్డి జిల్లా గాంధారిలో 1.4, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 1.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్​లోని షేక్​పేట, ఖైరతాబాద్, అమీర్​పేట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. వికారాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్​నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోనూ జల్లులు కురిశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)