ఫుడ్ యాప్ లలో ఫేమస్ మాత్రం స్విగ్గీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసిన ఆర్డర్ టైంకు వస్తుందనే నమ్మకం. ఇప్పుడు స్విగ్గీ మరో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. 2023 న్యూ ఇయర్ రాత్రి.. ఏకంగా 3.5 లక్షల బిర్యానీలు అమ్ముడు పోయాయని ప్రకటించిన స్విగ్గీ, ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఇప్పుడు దానికి రెట్టింపుగా 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని తెలిపింది. ఏ ఐపీఎల్ సీజన్ లో రాని ఆర్డర్లు ఈ సీజన్ లో వచ్చినట్లు తెలిపింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. మరోవైపు ఐపీఎల్ సీజన్ ను స్విగ్గీ బాగానే క్యాష్ చేసుకుంది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. ముంబయితో ఎలిమినేటర్ పోరులో లక్నో ఓడిపోవడంతో అబ్బాయిలూ టెన్షన్ పడకండి.. మేము లక్నోలో టిష్యూలను రీస్టాక్ చేయడం ప్రారంభించాం అంటూ ట్రోల్ చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల మ్యాచ్ పదే పదే ఆగిపోతుండటంపై అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారు? అంటూ ఫన్నీ ట్వీట్ చేసింది. ఇలా క్రికెట్ ను, ఫుడ్ తో ముడిపెడుతూ ట్వీట్లు చేసింది.
ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా స్విగ్గీకి కాసుల పంట !
May 30, 2023
0
Tags