హరిహర వీరమల్లు మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0

హరిహర వీరమల్లు మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో సెట్ లో మంటలు ఎగసిపడ్డాయని అక్కడి వారు చెబుతున్నారు. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది సెట్‌లో మంటలను అదుపు చేశారు. అయితే వర్షానికి సెట్‌ కూలగా దానికి మరమ్మత్తులు చేసే క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. కాగా ఎవ్వరి ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి సెట్ నిర్మించి పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది దాంతో ఈ మూవీ షూటింగ్ కు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)