పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపుర్ ప్రాంతంలో నివసిస్తున్న హఫ్నా సోరెన్‌కు కుమారుడు మంగళ్ సోరెన్ (33), కుమార్తెలు సుమీ సోరెన్ (35), బహమనీ సోరెన్ (23)లు ఉన్నారు. సుమీ సోరెన్ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుంది. బహమనీ సోరెన్ గృహిణి. ఇటీవల మంగళ్ సోరెన్‌కు వివాహం నిశ్చయమైంది. ఈరోజు వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. సోదరుడి పెళ్లి కారణంగా మంగళ్ తోబుట్టువులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసింది. ఇంటిలో నుండి మంటలు వస్తుండటంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా, కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు. హఫ్నా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు సజీవదహనం
May 28, 2023
0
Tags