బీసీ నేతగా గుర్తింపు పొందిన బంగారప్ప కుటుంబానికి 20 సంవత్సరాల తరువాత మళ్లీ మంత్రి మండలిలో అవకాశం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప శనివారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోరబ నియోజకవర్గంలో తన సోదరుడు కుమార బంగారప్పపై గెలుపొంది ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుకున్నారు. కాగా మధు బంగారప్ప, కుమార్ బంగారప్పల మధ్య సయోధ్య కోసం పెద్దల ప్రయత్నాలు ఫలించలేదు. ఏదీ ఏమైనా బంగారప్ప కుటుంబానికి 20 సంవత్సరాల తరువాత మంత్రి మండలిలో మళ్లీ అవకాశం లభించినట్లయింది.
బంగారప్ప కుటుంబానికి మంత్రి పదవి
May 28, 2023
0
Tags