ప్రపంచ ధనవంతుల జాబితాలో హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత టాప్-5లో ఉన్న గౌతమ్ అదానీ స్థానం టాప్-30కి పడిపోయింది. అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన తీవ్రమైన ఆరోపణల నుంచి ఇటీవలే గౌతమ్ అదానీ గ్రూప్ తేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించేందుకు గౌతమ్ అదానీ అనేక అప్పులను గడువు కంటే చాలా ముందే చెల్లించారు. ఆ తర్వాత వారిపై ఒత్తిడి తగ్గడంతో వారి గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్ల బలమైన పనితీరుతో అదానీ ఈ జాబితాలోకి దూసుకెళ్లారు. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో వెనుకబడ్డారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అతడిని ఢీకొట్టాడు. ఈ జాబితాలో జుకర్‌బర్గ్ 12వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అంతకుముందు అదానీ వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు టాప్ 20లో చేరారు. అదానీ గ్రూప్ యజమాని నికర విలువ 62.9 బిలియన్ డాలర్లు. సంపన్నుల జాబితాలో 18వ స్థానానికి ఎగబాకాడు. గత 24 గంటల్లో అదానీ సంపద 438 మిలియన్ డాలర్లు పెరిగింది. గౌతమ్ అదానీ ఇప్పుడు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్‌లో 24వ స్థానంలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. అదానీ విల్మార్, పవర్ అండ్ ట్రాన్స్‌మిషన్ షేర్లు బలంగా పుంజుకున్నాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరిగింది. దీంతో గౌతం అదానీ సంపద పెరిగింది.
ప్రపంచ ధనవంతుల జాబితా టాప్ 20లో అదానీ !
May 30, 2023
0
Tags