కర్ణాటకలోని మంగళూరులో బెల్తాంగడి తాలూకా ఉజిరేలో స్ధానికంగా ఓ యువతితో మాట్లాడుతున్న ముస్లిం యువకుడి పట్టుకుని నలుగురు దాడి చేశారు. ఈ ఘటనలో సదరు ముస్లిం యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై అనంతరం పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదుచేశారు. మంగళూరు ఘటనలో అరెస్టయిన వారిలో తోటతడి గ్రామానికి చెందిన దినేష్, నితేష్, సోమంతడ్క గ్రామానికి చెందిన అవినాష్, బెల్తంగడి తాలూకాలోని ముండాజే గ్రామానికి చెందిన సచిన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదుదారు మహ్మద్ జాహీర్ మంగళూరులోని క్యాటరింగ్ యూనిట్‌లో తన పని ముగించుకుని మంగళూరు నుండి చిక్కమగళూరుకు వెళ్లే కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. చార్మడి-కక్కింజే గ్రామానికి టిక్కెట్టు తీసుకుని అదే ప్రాంతానికి చెందిన యువతి పక్కన కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఈ సమయంలో వారితో పాటే ప్రయాణిస్తున్న నిందితుడు నితీష్ వీరిని గమనిస్తున్నాడు. బస్సు బెల్తంగడి చేరుకోగానే బాలిక దిగింది. ఉజిరేలో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఆగడంతో నిందితులతో సహా కొందరు వ్యక్తులు బస్సులో నుంచి దిగారు. నితీష్ తో పాటు ఇతర నిందితులు జహీర్‌ను బస్సు నుండి దింపారు. బాలికతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను చూపించి దాడికి పాల్పడ్డారు. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన జహీర్ స్నేహితుడు సమీర్‌కు కూడా దెబ్బలు తగిలాయి. ఈసారి బతికిపోయారు, ఇంకోసారి పునరావృతమైతే వదలమని వారు హెచ్చరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు.
కర్ణాటకలో ముస్లిం యువకుడిపై దాడి !
April 06, 2023
0
Tags