కెనడాలోని మసీదులో ఓ వ్యక్తి ముస్లింలపై దాడి చేశాడు. అంతేకాదు మహ్మద్ ప్రవక్తను అవమానించాడు. ఈ ఘటనపై ముస్లిం సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముస్లిం నాయకులు ఈ దాడిని ఇస్లామోఫోబియాతో ప్రేరేపించిన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటన కెనడియన్ ముస్లింలలో భయాన్ని పెంచిందన్నారు. మార్ఘమ్ లోని మసీదులో 28ఏళ్ల టొరంటో వ్యక్తిని ద్వేషపూరిత నేరానికి పాల్పడ్డాడని ఆరోపించిన తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కారులో కూర్చుని నమాజ్ కు వెళ్తున్న ముస్లింలను బెదిరించి దుర్బాషలాడాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు పార్కింగ్ లో ప్రమాదకరంగా వాహనం నడిపాడని వెల్లడించారు. ఇలాంటి ఘటనల భయాందోళకు గురిచేస్తున్నాయని ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ మార్కమ్ అధ్యక్షుడు కాసిర్ నాసిర్ ఖాన్ అన్నారు. టొరంటో డౌన్‌టౌన్‌కు ఉత్తరాన 30 కి.మీ దూరంలో ఉన్న మసీదు వెలుపల ఒక వ్యక్తి ఇస్లామోఫోబిక్ చర్యలకు పాల్పడ్డాడు. మా మసీదును తగలబెడతానని బెదిరించాడు. మహ్మద్ ప్రవక్త గురించి తప్పుడు మాటలు మాట్లాడాడని వెల్లడించారు.
కెనడాలో ముస్లింలపై దాడి !
April 11, 2023
0
Tags