తెలంగాణలో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " అంబేద్కర్ ఆశయాలను పాటించడమే ఆ మహానీయుడికి సమర్పించే నిజమైన నివాళి. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ కొత్త దారి చూపుతోంది. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్నే ఉండాలని అంబేద్కర్ భావించారు.కానీ అతడి ఆశయం నెరవేరలేదు. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ కోసం కొన్నేళ్లుగా పోరాటం జరిగింది. భారత రాజ్యాగం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. సమాజంలో మార్పు కోసం అంబేడ్కర్ భావజాలం అవసరం. అంటరాని తనాన్ని పారద్రోలడానికి అంబేడ్కర్ కృషి చేశారు. కొన్ని అతిచిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సమాజంలో మార్పుకోసం అంబేద్కర్ కృషి చేసిన మార్గంలోనే కేసీఆర్ పయనిస్తున్నారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు" అని ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగించారు.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్నే ఉండాలని అంబేద్కర్ భావించారు !
April 14, 2023
0
Tags