సిక్కుల భేటీకి అమృత్‌పాల్ పిలుపు

Telugu Lo Computer
0


ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబీ పోలీసుల లీవ్‌లను రద్దు చేశారు. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్ భారీ మీటింగ్‌కు పిలుపునివ్వడంతో ఆ రాష్ట్ర డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి అమృత్‌పాల్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. సిక్కు మతస్తుల సంఘం అకాల్ తక్త్ భారీ సభనుఏర్పాటు చేయనున్నది. ఏప్రిల్ 14వ తేదీన బైసాకీ పర్వదినం నేపథ్యంలో ఈ మీటింగ్‌ను నిర్వహించాలనుకుంటున్నారు. అయితే అప్పటి వరకు లీవ్‌ లను రద్దు చేయాలని పంజాబ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సాంక్షన్ చేసిన లీవ్‌లను రద్దు చేశారు. కొత్త లీవ్‌లు ఇవ్వడంలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)