కాంగ్రెస్ పార్టీకి మతిపోయింది !

Telugu Lo Computer
0


కర్ణాటక ఎన్నికల ర్యాలీలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మతిపోయిందని అన్నారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోడీని పొగుడుతుంటే కాంగ్రెస్ మాత్రం విష సర్పం అంటూ పిలుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అంతకుముందు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని, భారత్ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచం మొత్తం మోడీని ఆమోదించిందని, సోనియా గాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తున్నారని, ఆమె విషకన్య అంటూ, భారత్ ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్తాన్, చైనాలకు ఆమె ఏజెంట్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదాస్పదం అవడంతో మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. నేను మోడీని వ్యక్తిగతంగా విమర్శించలేదేని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు విషపూరితం అని అని అన్నానని చెప్పుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)