అమ్మకానికి హెచ్ఎండీఏ ప్లాట్లు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి, మేడిపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. బాచుపల్లిలో 133 ప్లాట్లు, అలాగే మేడిపల్లిలో 85 ప్లాట్లకు వచ్చే నెల 22 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటికి మార్చిలో మొదటి విడత కింద కొన్ని ప్లాట్లను విక్రయించగా కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా రెండో విడతలో భాగంగా రెండు లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ప్రకారం.. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, మేడిపల్లిలో రూ.32 వేలు చొప్పున హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ ధరలను నిర్ణయించింది. కనీస బిడ్‌ పెంపుదల చదరపు గజానికి రూ.500 చొప్పున ఉండాలంటూ నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. ఈ రెండు లే అవుట్లకు సంబంధించి మరింత సమాచారం కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌, ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్‌, ఎంఎస్‌టీసీ ఇండియా వెబ్‌సైట్లను సందర్శించాలని తెలిపింది. లేఅవుట్‌ల సందర్శనకు, సందేహాల నివృత్తి కోసం.. ఫోన్‌ నంబర్లు.. 7396345623, 9154843213లో సంప్రదించాలని హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)