తల్లి ఐడీతో న్యూడ్ ఫోటోలు షేర్ చేసిన మైనర్ బాలిక !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ గ్రామంలో ఒక మైనర్ బాలిక సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. యూత్ పైగా కొత్త కాబట్టి ఆమెకు ఆకర్షణ కలగడం సహజం. ఈ విధంగా ఆమె కరోనా కాలంలో మొబైల్ ఫోన్‌ను విరివిగా ఉపయోగించింది. చదువుకుంటుందని ఆమెకు మొబైల్ తప్పనిసరిగా భావించి పేరెంట్స్ ఇచ్చారు. కుటుంబసభ్యులు ఆమె చదువు కోసం ఏదో ఒకటి చూస్తూ ఉంటుందనుకున్నారు. స్టడీ వీడియోలు ఉపయోగకరంగా ఉన్నాయని తాను తల్లిదండ్రులకు చెప్పింది. కానీ, సోనూకి ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ గురించి అర్థమైంది. దాని పట్ట ఆకర్షితురాలైంది. దీంతో ఆమె తన తల్లి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచింది. దాంట్లో ఓ యువకుడు పరిచయమైయ్యాడు. అప్పటి నుండి ఆమెకు ఇన్‌స్టా స్నేహితుడితో బంధం ఏర్పడింది. అక్టోబర్ 2022 నుండి ఇన్‌స్టాలో అనిల్ కర్మద్‌తో సోను టచ్‌లో ఉంది. అతడు వాడేది నకిలీ ఐడీ. మొదట్లో ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాడు. దీంతో ఆమె అతడిని నమ్మింది. ఆ సమయంలో తన న్యూడ్ ఫోటోలను అతడితో షేర్ చేసుకుంది. అప్పటి నుంచే సోనూకు కష్టాలు మొదలయ్యాయి. ఫోటోలు పంపించిన తర్వాత గానీ అనిల్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. తనతో మాట్లాడకపోతే సోనూ న్యూడ్ ఫోటోలు ఫేస్ బుక్ లో షేర్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. సోనూ బంధువులకు అసభ్యకరమైన ఫొటోలు పంపాడు. బాలిక ఇంట్లో జరిగినదంతా వెలుగులోకి వచ్చింది. ఆమె తన తప్పును అంగీకరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)