గోవులను తరలిస్తున్నారని చంపేశారు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని  రామనగర జిల్లా కనకపుర తాలుకాలోని సాతనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో (బెంగళూరు శివారు)లో పశువులు తరలిస్తున్న వాహనాన్ని పునీత్ కెరహళ్లి అలియాస్ పునీత్ అనే వ్యక్తితో పాటు అతని అనుచరులు అడ్డగించి పశువులు తరలిస్తున్న వాహనంలోని వారిని పునీత్ తో పాటు అతని అనుచరులు చితకబాదేశారు. ఈ దాడిలో మండ్య జిల్లాకు చెందిన ఇద్రీష్ పాషా అనే వ్యక్తి చనిపోయాడు. ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో ఇద్రీష్ పాషా శవం గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్రీష్ పాషాను కొందరు హత్య చేశారని యనుష్ పాషా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని ఏడీజీపీ అలోక్ కుమార్ మీడియాకు చెప్పారు. ఇద్రీష్ పాషను హత్య చేసిన తరువాత పునీత్ తో పాటు అతని అనుచరులు గోపి, పవన్ కుమార్,, పిల్లింగ్ అంబిగార్, సురేష్ కుమార్ బెంగళూరు నుంచి హుబ్బళి, బెళగావి, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా రాజస్థాన్ కు వెళ్లి అక్కడి బార్డర్ జిల్లాలో తలదాచుకున్నారని ఏడీజీపీ అలోక్ కుమార్ మీడియాకు చెప్పారు. నిందితులు అందరూ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని, అయితే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన పునీత్ తాము ఎక్కడికి పారిపోలేదని. రామనగరలోనే ఉన్నామని చెప్పారని, ఆ దెబ్బతో అందరూ చిక్కిపోయారని అలోక్ కుమార్ అన్నారు. గురువారం రాజస్థాన్ లోని కోర్టులో నిందితులను హాజరుపరిచి రామనగరకు తీసుకు వస్తామని ఏడీజీపీ అలోక్ కుమార్ మీడియాకు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)