పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి !

Telugu Lo Computer
0


బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఎస్‌కోట టౌన్ అధ్యక్షుడు రెహమాన్ ఆయన్ను కలిశారు. స్థానిక పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతుందంటూ ఫైర్ అయ్యారు. పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అంటూ మండిపడ్డారు. బొత్స కామెంట్స్ తో ఆవాక్కయ్యారు కార్యకర్తలు. మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇలాగేనా మాట్లాడేదంటూ పార్టీ కేడర్ గుర్రుగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)