మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం హనుమాన్ జయంతి, మహావీర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కైలాష్ మాట్లాడుతూ 'నేను రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో ఉన్న యువకులను చూస్తే వారిని ఐదారు చెంపదెబ్బలు కొట్టాలనిపిస్తుంది. ఇక మనం ఆడపిల్లలను దేవతల్లా భావిస్తాం. కానీ వారు వేసుకునే డ్రెస్సుల్ని చూస్తే వారు దేవతల్లా కాదు, శూర్పణఖల్లా కనిపిస్తారు. మంచి బట్టలు వేసుకోమని మీ పిల్లలకు మీరు నేర్పించడి' అని ఆయన అన్నారు. కైలాష్ వ్యాఖ్యలకు సోషల్‌మీడియా నెటిజన్లు, ప్రతిపక్షనేతలు నైతికవిలువల్ని దిగజార్చుతున్నారని ఆయనపై మండిపడ్డారు. కైలాష్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సంగీతా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతలు మహిళలను పదేపదే అవమానిస్తున్నారని, ఇది వారి ఆలోచనా తీరుకి, వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కైలాష్ విజయవర్గీయ మహిళలను శూర్ఫణఖలని అనడం, వారి దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మీడియా ప్యానలిస్ట్ అయిన షామా మొహమ్మద్ కైలాష్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. 'ఇప్పుడు స్మృతి ఇరానీ ఎక్కడుంది? ఈ అసహ్యకరమైన వ్యాఖ్యలను ఆమె మన్నిస్తారా? స్మృతి గొంతు బిజెపి నేతల వ్యాఖ్యలపై పెగలదు. కేవలం.. రాహుల్‌గాంధీని విమర్శించడానికి మాత్రమే ఆమెకు గొంతులేస్తుంది.' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ బిజెపి ప్రధాన కార్యదర్శి వివాదాస్పద వ్యాఖ్యలు !
April 08, 2023
0
Tags