గుండెపోటుతో టీచర్‌ అకాల మరణం

Telugu Lo Computer
0


తెలంగాలోని సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పద్మలత బుధవారం పాఠాలు చెబుతోంది. ఈ క్రమంలో మధ్యలో తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగింది. అనంతరం, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. సంగారెడ్డి స్వస్థలమైన ఆమె మృతిపట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)