ఏసీ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచడం ద్వారా మంచి కూలింగ్‌ని చేస్తుందని చాలా మంది నమ్మకం. కానీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24. అటువంటి పరిస్థితిలో, ఉష్ణోగ్రత 24 వద్ద ఉంచండి.  దీని వాళ్ళ చాలా విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ తగ్గించడం ద్వారా 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ఏసీ గదిలోని ప్రతి తలుపు, కిటికీని మూసివేయండి. తద్వారా వేడి గాలి లోపలికి రాదు, చల్లటి గాలి బయటకు వెళ్లదు.  చాలా ఏసీలు స్లీప్ మోడ్ ఫీచర్‌తో వస్తున్నాయి. ఈ మోడ్ 36 శాతం విద్యుత్తును ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. ఏసీతో ఫ్యాన్‌ని ఉపయోగిస్తే.. అది గదిలోని ప్రతి మూల నుండి ఏసీ గాలిని ప్రసారం చేస్తుంది. ఇది గదిని చల్లగా ఉంచుతుంది. దీంతో పాటు మీరు ఏసీ ఉష్ణోగ్రతను కూడా తగ్గించాల్సిన అవసరం లేదు. విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)