తల్లీ కూతుళ్లు ఏమయ్యారు ?

Telugu Lo Computer
0


ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీ కూతుళ్లు కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్‌ వివరాల ప్రకారం మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో నివసించే డి.వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ (37) భార్యాభర్తలు. ఈశ్వరమ్మ గృహిణి. వీరికి పూర్వజ (19), హరిణి (18) కూతుళ్లు. ప్రస్తుతం వీరు చదువుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)