సల్మాన్ ఖాన్ ను నెలాఖరులోగా చంపేస్తాం !

Telugu Lo Computer
0


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను నెలాఖరులోగా చంపేస్తామంటూ  గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ లో బెదిరించారని ఈ కాల్  ఏప్రిల్ 10వ తేదీన వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనను తాను రాఖీభాయ్ గా పరిచయం చేసుకున్నాడని, రాజస్థాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు కూడా చెప్పటం విశేషం. వాళ్లకీ వీళ్లకీ కాకుండా ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం, చంపి తీరతాం అని చెప్పటం సంచలనంగా మారింది. పోలీస్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన కాల్ పై విచారణ ముంబై పోలీసులు చేస్తున్నారు. ఇందులో నిజం ఉందా లేదా  ఏదైనా ప్రాంక్ కాల్ చేశాడు.. కాల్ చేసిన వ్యక్తి వివరాలను ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ మేరకు ముంబై పోలీసులు రాజస్థాన్ పోలీసులను సైతం అలర్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం సల్మాన్ ఖాన్ కు ఈ-మెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది. ఆ క్రమంలోనే కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలు చేశాడు బాలీవుడ్ హీరో. దీనికితోడు సెక్యూరిటీ పెంచారు ముంబై పోలీసులు. ఎక్కడికి వెళ్లేదే.. ఏ రోజు ఏ షూటింగ్ లో పాల్గొనేది అనేది ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి వెళుతున్నారు.  జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మార్చి నెలలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణ జింక వివాదం కేసులో సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో నెల రోజుల్లోనే మరో సారి ముంబై పోలీసులకు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని.. అది కూడా ఏప్రిల్ 30వ తేదీలోపు అని ఫోన్ చేసి చెప్పటంతో ముంబై పోలీసులు సెక్యూరిటీ మరింత పెంచుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)