ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల సమయంలో మార్పులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 8 గంటల నుంచే బానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో కొననసాగుతోంది. పెరిగిన ఎండల దృష్ట్యా ఇప్పటికే స్కూళ్లకు ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. విద్యార్ధులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు సమీపించడంతో ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షల సమయాలను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతుల వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. పరీక్షల అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను ఇళ్లకు పంపిచేలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)