మహిళనుఎద్దు దాడి నుంచి కాపాడిన బాలుడు !

Telugu Lo Computer
0

ఒక వీధిలో మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెకు ఎదురుగా వచ్చిన ఎద్దు ఒక్కసారిగా దాడికి దిగింది. తన కొమ్ములతో ఎత్తి పడేసింది. పాపం కిందపడిపోయిన ఆమె లేవలేని పరిస్థితిలో అలాగే ఉండిపోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన ఓ బాలుడు ఆ మహిళను ఎలాగైనా కాపాడాలని పరుగు పరుగున ముందుకు వచ్చాడు. పాపం అతడిని కూడా ఎత్తి పడేసింది. దాని దెబ్బల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ చిన్నోడు వెంటనే లేచి ఆ మహిళను లేవదీయడానికి ప్రయత్నించాడు. మరోసారి ఇద్దరిపై ఎద్దు దాడి చేసి కింద పడేసింది. అప్పటికే అక్కడికి చేరుకున్న స్ధానికులు ఎద్దుని కర్రలతో తరిమి వేయడంతో బాలుడితో పాటు ఆ మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. కుమార్ మనీష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. చాలామంది ఆ బాలుడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి ఆ మహిళను రక్షించడానికి ముందుకు వెళ్లిన తీరుని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)