సీజనల్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐతే కొన్ని పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అన్ని రకాల తీవ్రమైన వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. కొన్ని పండ్లలోని పోషకాలు చాలా వరకు వాటి తొక్కల్లోనే ఉంటాయని, వాటిని పొట్టు తీసి తినడం వల్ల ఆ పోషకాల పూర్తి ప్రయోజనాలు అందవని అధ్యయనాలు చెబుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్లు తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. పండ్లలోని పూర్తి స్థాయి ప్రయోజనం పొందడానికి, వాటిని సరైన మార్గంలో, సరైన సమయంలో తీసుకోవడం అవసరం. సూర్యాస్తమయం తర్వాత పండ్లు తినకూడదని అధ్యయనాలలో ఆధారాలు ఉన్నాయి, అవి జీవక్రియను ప్రభావితం చేస్తాయి. చాలా మంది ఆపిల్‌ను తొక్కతీసి కూడా తింటూ ఉంటారు. నిపుణులు దీనిని తప్పుగా భావిస్తారు. ఆపిల్ పండు తొక్కలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒలిచిన యాపిల్ తినడంతో పోలిస్తే, మనం తొక్కతో తింటే, అది 332శాతం ఎక్కువ విటమిన్-కె, 142శాతం ఎక్కువ విటమిన్-ఎ, 115శాతం ఎక్కువ విటమిన్-సి, 20శాతం కాల్షియం, 19 శాతం పొటాషియం ఉంటుంది. కీరా దోసకాయను పొట్టు తీయకుండా తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది.ముదురు ఆకుపచ్చగా కీరా దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్-కె కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరానికి అందించాలంటే పొట్టు తీయకుండా తినాలి. పచ్చి లేదా పండిన మామిడి తొక్కతో తినడం మరింత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, రొమ్ము, మెదడు, వెన్నుపాము క్యాన్సర్ అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే మాంగిఫెరిన్, నోరెథిరోల్ ,రెస్వెరాట్రాల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మామిడి తొక్కల్లో ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మామిడి పండును పొట్టుతో కలిపి తినాలి. ఆరెంజ్ విటమిన్-సి ఉత్తమ మూలంగా పరిగణిస్తారు. ఇది శరీరం రోగనిరోధక శక్తిని మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్-సి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. నారింజ పండులో ఉండే విటమిన్-సి దాని తొక్కలో రెండింతలు ఎక్కువగా ఉంటుంది. దీని తొక్కలో రిబోఫ్లావిన్, విటమిన్-బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి.
పండ్ల తొక్కలో అనేక రకాల పోషకాలు !
April 28, 2023
0