తమిళనాడులోని కాంచీపురం సమీపం కీళక దిర్‌పూర్ ప్రాంత ప్రజల సౌక ర్యార్థం ఎంటీసీ కొత్త బస్సు సేవలు ప్రారంభించింది. ఈ బస్సు సేవలను సోమవారం ప్రారంభించిన కాంచీపురం డీఎంకే ఎమ్మెల్యే ఎళిలరసన్ స్వయంగా బస్సును నడిపారు. కొందరు ప్రయాణికులు, పార్టీ కార్యకర్తలు ఉన్న బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఊహించని ఘటనతో ప్రయాణికులు పెద్దగా కేకలు పెట్టారు. తదుపరి అందర్నీ బస్సు నుంచి దించిన కార్యకర్తలు, కాలువ నుంచి వాహనాన్ని తోయడంతో ఎంటీసీ డ్రైవర్ బస్సును వెలుపలికి తీసుకొచ్చాడు.
ఎమ్మెల్యే నడిపిన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది !
April 05, 2023
0
Tags