బ్రిటీష్ పర్యాటకుడు మార్క్ అతని స్నేహితుడితో కలిసి క్రాకోలోని వైల్డ్ నైట్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ ఇచ్చిన ఫ్రీ ఎంట్రీ ఆఫర్ కు మార్క్, వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని భావించాడు. తనతో వచ్చిన స్నేహితుడు కూడా ఈ ఉచిత ప్రవేశం ఆఫర్ కు అట్రాక్ట్ అయ్యాడు. కానీ అతను ఎక్కువ తాగడానికి నిరాకరించాడు. అలా మార్క్ కేవలం 90 నిమిషాల్లోనే 22 పెగ్గులు తీసుకున్నాడు. ఆ తర్వాత తూలుతూ కుప్పకూలి మరణించాడు. అంతే కాదు అతను పడిపోయిన తర్వాత క్లబ్ సిబ్బంది అతని వద్ద నుంచి కొంత నగదును కూడా దొంగిలించారు. పోలిష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రకారం, క్లబ్‌లు ఒక రాకెట్‌ను నడుపుతాయి, కస్టమర్‌లను తాగించి, ఆపై వారిని దోచుకుంటాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీబీఎస్పీ పేర్కొంది. మత్తులో ఉండి, స్పృహ కోల్పోయి, ఆపై తీవ్రమైన ఆల్కహాల్ పాయిజనింగ్ ఫలితంగా మరణించాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. సంఘటన సమయంలో వ్యక్తికి వైద్య సహాయం అందించలేదని, ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారిపై తాత్కాలిక అరెస్టులు చేశామని తెలిపారు. ఈ విషాద సంఘటన తర్వాత పోలిష్ పోలీసులు అనేక నైట్‌క్లబ్‌లపై దాడి చేసి అటువంటి క్రైమ్ రాకెట్లను ఛేదించారు.
ఫ్రీ ఎంట్రీ ఆఫర్ కు వ్యక్తి బలి !
April 20, 2023
0
Tags