భార్య దోసె వేయలేదని కత్తితో దాడి చేసిన భర్త

Telugu Lo Computer
0


తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మాత్తూరు సమీపంలోని ఎన్‌ మోటూరు గ్రామానికి చెందిన గణేశన్‌ (60) భార్య మాధమ్మాల్‌ (50) దంపతులు. గణేశన్‌ దోసె చేయమని భార్యకు పురమాయించాడు. భార్య మాధమ్మాల్‌ మూడు దోసెలు వేసి, భర్తకు వడ్డించింది. అంతలో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయింది. గణేశన్‌ మరో 3 దోసెలు వేయమని భార్యను అడగడంతో ఆమె గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందని చెప్పింది. దీంతో భార్య దోసె చేయలేదనే కోపంతో గణేశన్‌ కత్తితో మాధమ్మాల్‌ తల, చేయి నరికాడు. మామను అడ్డుకునేందుకు వెళ్లిన కోడలు విజయలక్ష్మి, మనుమరాలు  తానీషా(2)కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన మాధమ్మాల్‌తోపాటు విజయలక్ష్మి, చిన్నారి తానీషాలను చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మాత్తూరు పోలీసులు గణేశన్‌ను అరెస్టు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధమ్మాన్‌ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)