హైదరాబాద్ లోని సనత్ నగర్ లో 8 ఏళ్ల అబ్దుల్ వహీద్ అనే బాలుడిని అమవాస్య రోజున హిజ్ర నరబలి ఇచ్చిందన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రా ఇంటి సమీపంలోని నాలాలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. కోపోద్రిక్తులైన స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. అక్కడికి భారీగా జనాలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం తప్పిపోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. ఇది నరబలే ఉంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇమ్రాన్ అనే హిజ్రా పిలవడంతో బాలుడు ఆమెతో కలిసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అబ్దుల్ వాహీద్ అనే బాలుడి నరబలి ఇచ్చారనే వచ్చిన వార్తలపై డీసీపీ శ్రీనివాసరావు ఖండించారు. బాలుడు మిస్ అవగానే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలింపు మొదలుపెట్టామని, బాలుడిని చంపేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇమ్రాన్ అనే హిజ్రా బాలుడిని మర్డర్ చేసి ఆటో డ్రైవర్ సహాయంతో నాలాలో పడేసినట్లు విచారణ వెల్లడైందని తెలిపారు. ఆర్థిక కారణాల వల్లే ఈ హత్య జరిగినట్లు చెప్పారు. హిజ్రా ఇంట్లో బాలుడిని చంపేసి బకెట్‌లో డెడ్ బాడీని పెట్టి.. గోనె సంచిలో నాలాకి తీసుకెళ్లిందని వెల్లడించారు.
8 ఏళ్ల బాలుడి నరబలి ?
April 21, 2023
0
Tags