కారులో హెల్మెట్ పెట్టుకోలేదని రూ.1000 జరిమానా !

Telugu Lo Computer
0


కారు నడుపుతూ హెల్మెట్‌ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఉత్తర్‌ప్రదేశ్‌ హమీర్‌పూర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయలు  ఫైన్ వేశారు. ముస్కరా పట్టణానికి చెందిన పవన్‌కుమార్‌ ఏప్రిల్‌ 18న తన కారులో వార్త పత్రికలను వేసి తిరిగి ఇంటికి వస్తుండగా పోలీసులు కారు ఆపారు. విధుల్లో ఉన్న స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నందకిశోర్‌ యాదవ్‌ కారు ఫొటో తీసి రూ.1,000 చలాన్‌ విధించారు. తనకు ఎందుకు జరిమానా విధించారని పవన్ ఇన్స్పెక్టర్ ను ప్రశ్నించాడు. దీంతో కారుని నడుపుతూ హెల్మెట్‌ పెట్టుకోలేదని చలాన్‌ వేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు సమాధానం ఇచ్చాడు. దీంతో పవన్ షాక్ తిన్నాడు. దీంతో అతడు హెల్మెట్ వేసుకుంటూ తన వాహనాన్ని నడపడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల తీరును నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)