సినీ నటి ఇంట్లో సహాయకున్ని వరించిన లాటరీ !

Telugu Lo Computer
0


అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా 1995లో కేరళకు బతుకుదెరువు కోసం వచ్చాడు. గత కొన్నేళ్లుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే ఇటీవల కూడా ఎస్​ఈ 222282 టికెట్‌ ను కొన్నాడు. అయితే ఈసారి దెబ్బకు అతని దశ తిరిగిపోయింది. కేరళ లాటరీ డిపార్డ్​మెంట్​ ‘సమ్మర్​ బంపర్​ బీఆర్​ 90 లాటరీ’ విడుదల చేసిన ఫలితాలలో ఆల్బర్ట్‌కి ఏకంగా రూ.10 కోట్ల బంపర్​ లాటరీ తగిలింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది. మొదటి బహుమతి పది కోట్లు కాగా రెండవ బహుమతి టికెట్ నంబర్ SB 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్‌లకు మొదటి, రెండు బహుమతులు లభించడం మరో విశేషం. బంపర్‌ లాటరీ గెలుచుకున్న అల్బర్ట్​ ఇందుకు చేయవలసిన ప్రక్రియను​పూర్తి చేసుకుని టికెట్​ను కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్‌ను సమర్పించాడు. ఇక ఈ లాటరీ లక్కీ డ్రాలో.. రెండో బహుమతి రూ.50 లక్షలుగా, మూడో బహుమతి ఐదు లక్షలు, నాలుగో బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు లభించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)