పశ్చిమ్ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్ జిల్లాలోని ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత అది మరింత గాఢంగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు కుమార్తెకు సంబంధం కుదిర్చి వివాహం జరిపించారు. దీంతో సమస్య కొలిక్కి వస్తుందని భావించారు. అయితే, వారి ఆశలు ఫలించలేదు. పెళ్లయిన నెల తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లి ప్రేయసి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి మాల్దాలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ప్రశ్నించినా వెనక్కి తగ్గలేదు. తాము మేజర్లమని, తమ సంబంధాన్ని అంగీకరిస్తేనే ఇంటికి వస్తామని, లేదంటే కోర్టుకెళ్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు.
పెళ్లయిన నెలకే పెళ్లి కూతురు ప్రియసఖితో జంప్ !
March 11, 2023
0
Tags