ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. సీనియర్ బాక్సింగ్ (48-50 కేజీలు) విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతాకం సాధించింది. అంతేకాక సీనియర్ విభాగంలో భారత మాజీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ చరిత్ర సృష్టించింది. ఇందుకోసం ఆమె ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 5-0 తేడాతో వియత్నాం బాక్సర్ న్యూయెన్ టి తామ్‌పై విజయం సాధించింది. గతేడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా నిఖత్ గోల్డ్ మెడల్ సాధించింది. అప్పుడు కూడా ఆమె 5-0 తేడాతోనే నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌నాల్‌ని ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా భారత్ తరఫున సీనియర్ బాక్సింగ్‌లో మేరికోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్‌గా.. అలాగే వరుసగా రెండో ఏడాది కూడా స్వర్ణపతాకం సాధించిన రెండో బాక్సర్‌గా నిఖత్ చరిత్ర పుటల్లో నిలిచింది. మరోవైపు బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా కూడా నిఖత్ జరీన్ రికార్డు సృష్టించింది. కాగా, శనివారం జరిగిన ఫైనల్స్‌లో కూడా భారత్ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగం నీతు గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయి ఖాన్ (మంగోలియా)ను నెల కరిపించగా.. 81 కేజీల విభాగం టైటిల్ పోరులో స్వీటీ బూర 4-3 తేడాతో వాంగ్ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది. దీంతో ఈ ఏడాది భారత్ ఖాతాలో 3 బాక్సింగ్ గోల్డ్ మెడల్స్ చేరాయి.
నిఖత్ జరీన్ కి వరుసగా రెండోసారి స్వర్ణం
March 26, 2023
0
Tags