కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత బి.ఎస్. యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్ పేరుకుపోవడంతో చివరి నిముషంలో పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం యడియూరప్ప , మరికొంతమంది భాజపా నేతలతో కలిసి కలబుర్గి వెళ్లారు. జెవార్గి ప్రాంతంలో వీరి హెలికాప్టర్‌ను దించేందుకు స్థానిక అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్‌పై చెత్తాచెదారం, ప్లాస్టిక్ షీట్లు పేరుకుపోయాయి. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు కిందకు రాగానే అవన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారాయి. దీంతో పైలట్ చివరి నిముషంలో ల్యాండింగ్‌ను రద్దు చేసుకోవడంతో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్‌ను శుభ్రం చేసి ల్యాండింగ్‌కు వీలు కల్పించారు. అప్పటిదాకా హెలికాప్టర్ అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది. కొంతసేపటి తర్వాత అదే హెలిప్యాడ్‌పై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం
March 06, 2023
0
Tags