కారు ఢీకొని ఒకరి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి పట్టణానికి చెందిన రెహమాన్‌ ఆదాన్‌ (18), బొగ్గుల నరేష్‌ (18) పల్సర్‌ బైక్‌పై మల్లూరమ్మ జాతరకు బయలుదేరారు. మదనపల్లె మార్గంలో వస్తుండగా ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై వెళుతున్న రెహమాన్‌లకు తలకు బలమైన గాయాలయ్యాయి.చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ ఒంటేరు రెడ్డి వంశీ, బొగ్గు నరేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)