మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని సంభాజీనగర్ రహదారిపై తెల్లవారుజామున 2:00 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళ వేషధారణలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బ్యాంకు ఏటీఎంలో ఓ మహిళ చోరీకి యత్నిస్తోందని కొందరు స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. ఆమె మహిళ కాదని, మగాడు అని మరికొందరు కాల్ చేశారు. జునా రాజ్‌వాడ పోలీసులు అలర్ట్ అయి తమ పోలీస్‌స్టేషన్‌లోని పెట్రోలింగ్ బృందాన్ని వెంటనే అక్కడికి పంపించారు. ఏటీఎం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సమయంలో ఓ మహిళ పంజాబీ దుస్తులు ధరించి ముఖాన్ని కప్పుకుని ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. పెట్రోలింగ్ బృందంలో ఒకరు అతను పాత నేరస్థుడు అంకుష్ కొండారే అని గుర్తించారు. కొండారే ఏటీఎంలో చొరబడి మెషీన్‌లోని హుడ్ డోర్ తెరిచి చోరీకి యత్నించాడు. కానీ దొరికిపోయాడు. అంకుష్ కొండారే పోలీసు రికార్డులో పాత నేరస్థుడు. 2018లో నాలుగు ఇళ్ల చోరీలకు సంబంధించి జునా రాజ్‌వాడ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
మహిళ వేషధారణలో ఏటీఎంలో చోరీ !
February 15, 2023
0
Tags