''భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య కీలక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంబంధాలను వాడుకొని శాంతిని నెలకొల్పేలా సాయం చేయాలని భారత్‌ను కోరాం. కానీ, అది సుదీర్ఘ ప్రక్రియ'' అని ఫ్రాన్స్ దౌత్యవేత్తలు వెల్లడించారు. భారత్-ఫ్రాన్స్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు దేశాలు అన్నిరకాల అంశాలపై చర్చించుకొంటాయని ఫ్రాన్స్ అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ త్వరలో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనికి భారత్ గైర్హాజరయ్యే అవకాశాలపై ఫ్రాన్స్ అధికారులను ప్రశ్నించగా ఆచితూచి స్పందించారు. భారత్ ఎప్పుడూ ఏదో ఒక పక్షాన చేరాలని అనుకోదని అభిప్రాయపడ్డారు. ''సమతౌల్యంపైనే ఎప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మేము భారత రాజకీయ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నాం. ఆ దేశ విధానం ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అది ఒక వేళా తీర్మానం ఓటింగ్‌కు గైర్హాజరైనా ఉక్రెయిన్ సమస్యపై పనిచేస్తుంది. మేం ఇప్పటికే వాస్తవిక ధోరణలో చర్చలు జరుపుతున్నాం. ఇందులో దాచేందుకు ఏమీ లేదు. ఆ తర్వాత నిర్ణయం వారి ఇష్టం'' అని ఫ్రాన్స్ దౌత్యవర్గాలు వెల్లడించాయి. ఐరాసలో ఇప్పటి వరకు రష్యా చేపట్టిన యుద్ధాన్ని ఖండిస్తూ దాదాపు డజను సార్లు వివిధ తీర్మానాలు వచ్చాయి. భారత్ వీటికి దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ వారంలో రానున్న తీర్మానం విషయంలో భారత్ వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.
శాంతిని నెలకొల్పేలా సాయం చేయండి !
February 22, 2023
0
Tags