ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్ సమావేశం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు. సాయంత్రం గం. 6.15 ని.లకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను కలవనున్నారు. రేపు మధ్యాహ్నం గం. 12.30ని.లకు ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ నజీర్ సమావేశమవుతారు. అనంతరం రేపు సాయంత్రం గం. 630 ని.లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నజీర్ భేటీ కానున్నారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన
February 25, 2023
0
Tags