ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ గా స్వీట్ కార్న్ తయారు చేసే ఓ వ్యక్తి పనితీరును వివరిస్తూ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి స్వీట్ కార్న్ తయారు చేసేటప్పుడు తనకు ఇష్టమైన మ్యూజిక్ ను వింటూ అందులో వచ్చే రిథమ్ తగ్గట్టుగా గరిటతో గిన్నెలను వాయిస్తున్నాడు. ' ఇతను ఏ షాపులో పనిచేస్తున్నాడో నాకు తెలియదు కానీ త్వరలో బెంగళూరులో జరగబోయే మహీంద్ర రిథమ్ ఫెస్టివల్ కు ఇతను గెస్ట్ గా రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ తో తన పనిని ఎంజాయ్ చేస్తున్న ఇతను తృప్తిగా జీవించడంలో సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాడు' అని మహీంద్ర ట్వీట్ చేశారు. బెంగళూరులో మార్చి 18న మహీంద్రా పర్కుషన్ ఫెస్టివల్ కార్యక్రమం జరగనుంది.
మహీంద్ర రిథమ్ ఫెస్టివల్ కు గెస్ట్ గా రావాలని కోరుకుంటున్నా!
February 13, 2023
0
Tags