మహిళల ఐపీఎల్ లో రూ. 3.40 కోట్లు పలికిన స్మృతి మంధాన

Telugu Lo Computer
0


మహిళల ఐపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ముగిసింది. 90 స్థానాల కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా ఐదు ఫ్రాంచైజీలు కలిసి 87 మందిని కొనుగోలు చేసింది. టీమిండియా  స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అత్యధికంగా రూ. 3.40 కోట్ల ధర పలికింది. ఆమెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్ నర్ ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్.. అంతే మొత్తానికి ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. జెమీమా రోడ్రింగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లకు) ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ వేలం తెలుగు ప్లేయర్స్ కు నిరాశనే మిగిల్చింది. 15 మందికి పైగా ప్లేయర్లు తమ పేర్లను వేలంలో రిజిస్టర్ చేసుకోగా కేవలం ఆరుగురు మాత్రమే అమ్ముడయ్యారు. కర్నూలుకు చెందిన అంజలి శర్వాణిని రూ. 55 లక్షలకు యూపి వారియర్జ్ సొంతం చేసుకుంది. గుంటూరు అమ్మాయి సబ్బినేని మేఘనను రూ. 30 లక్షలకు  గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. విశాఖ పట్నానికి చెందిన స్నేహ దీప్తిని రూ. 30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన అరుంధతి రెడ్డిని రూ. 30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఎస్ యశస్రీని రూ. 10 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది. వైజాగ్ కు చెందిన షబ్నమ్ షకీల్ ను రూ. 10 లక్షలకు గుజరాత్ జెయింట్స్ సొతం చేసుకుంది. అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా జట్టులో భాగంగా ఉన్న గొంగడి త్రిషను ఎవరూ కొనుగోలు చేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)