కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ మాజీ సీఎం సిద్ధరామయ్య కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసిందని, అయినా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇవ్వలేదని, ఈ విషయాలను ప్రధాని మోడీ ముందు ప్రస్తావించటానికి సీఎం బసవరాజ్ బొమ్మైకు గానీ కర్ణాటక బీజేపీ నేతలకు దమ్మూ, ధైర్యం లేదని మోడీ ముందు సీఎం కూడా కుక్కపిల్లలా వణకాల్సిందేనని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా సీఎం బసవరాజ్ బొమ్మై స్పందన ఏంటని అడుగగా ఆయన సానుకూలంగా స్పందించారు. మమ్మల్ని కుక్కలతో పోల్చటాన్ని సానుకూలంగానే తీసుకుంటున్నామని ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఉంటుంది. కుక్క నమ్మకమైన జంతువు. నేను కర్ణాటక ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తున్నాను కాబట్టి వారు నన్ను కుక్క అని పిలిచినా నాకు కోపంలేదని అన్నారు.
మోడీ ముందు బసవరాజ్ బొమ్మై కుక్కపిల్లలా వణుకుతారు !
January 04, 2023
0
Tags