తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్‌ను అప్‌డేట్ చేసింది. ఇది వరకు ఉన్న 'గోవింద' యాప్‌నే టీటీ దేవస్థానమ్స్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఎస్‌వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. యాప్‌లో తిరుమల చరిత్ర, స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచినట్లు వెల్లడించింది. ఇప్పటికే గోవింద యాప్‌ను తమ మొబైళ్లలో కలిగి ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'టీటీ దేవస్థానమ్స్'ను అప్‌డేట్ చేసుకోవాలని తితిదే సూచించింది. కొత్త వారు నేరుగా 'టీటీ దేవస్థానమ్స్'ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.
Post a Comment
0Comments
3/related/default