ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని వవ్వేరులో గద్దె సుబ్బమ్మ (70) ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన అల్లుడు గుంటపల్లి నారాయణ మద్యానికి నగదు ఇవ్వలేదని, అత్తను అత్యంత కిరాతకంగా రోకలిబండతో కొట్టి హతమార్చాడు. చనిపోయిందని నిర్ధారించుకొని ఆమె శరీరంపై ఉన్న నగల్ని దోచుకొని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ రామారావు, ఎస్సై వీరప్రతాప్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్తను చంపిన అల్లుడు !
January 19, 2023
0
Tags