ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారి పేరుతో బెదిరింపులకు పాల్పడిన రవిశంకర్‌కు నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెండో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి మాధవి మూడేళ్ల జైలుశిక్ష రూ.5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం రావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశంకర్ నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై 2019 సంవత్సరంలో కొండ్రపోల్ వద్ద గల రైతుమిత్ర ఎరువుల దుకాణంలోకి వెళ్లి విజిలెన్స్ అధికారినంటూ యాజమాని కటికం కృష్ణారెడ్డిని బెదిరించి అతని వద్ద నుంచి రూ.60వేల నగదు, ఒక బంగారు, రెండు వెండి ఉంగరాలను తీసుకెళ్లాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి వాడపల్లి ఎస్సై కె.నర్సింహారావు కేసు దర్యాప్తు చేశారు.నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు.ఈ కేసును పీపీ దీపారాణి వాదించగా, కోర్టు కానిస్టేబుల్ జానకిరాం సహకరించారు.
బెదిరించి వసూళ్లకు పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష !
January 06, 2023
0
Tags