గీజర్ నుంచి గ్యాస్ లీకై నవ వధువు మృతి

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గీజర్‌ నుంచి లీక్‌ అయిన గ్యాస్‌ పీల్చుకొని ఊపిరాడక నవ వధువు మృత్యువాతపడింది. ఇటీవల వివాహం అయిన వధువు స్నానం చేసేందుకు అత్తవారింట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాత్రూమ్‌ డోర్‌ తట్టి చూడగా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాత్రూమ్‌ తలుపులు పగలగొట్టగా, ఓ మూలన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే నవ వధువును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్‌ గీజర్‌లో నుంచి వెలువడిన కార్బర్‌ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వధువు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ గ్యాస్‌ చాలా ప్రమాదకరమని., పీల్చిన కొద్ది నిమిషాల్లోనే ఊపిరాకడ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గ్యాస్‌ గీజర్‌ను ఉపయోగించిన ప్రతిసారి దాని నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుంది. ఇది ప్రాణాంతకమైనది. వీటిని బాత్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకోకుండా ఉంటేనే మంచింది. వెంటిలేషన్‌ బాగా ఉండే ప్రదేశాల్లోనే ఫిట్‌ చేయాల్సి ఉంటుంది. గ్యాస్‌ గీజర్ల నిర్వహణ ఖర్చు ఎలక్ట్రిక్‌ గీజర్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే దేశంలో వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)