`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`ను ప్రారంభించిన భూపేష్ భగేల్

Telugu Lo Computer
0


`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ` వెబ్ సైట్ ను చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అధికారికంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సీఎం భూపేష్ పాల్గొనగా, సీఈవో ఆకుల దినేష్, హిందీ డిజిటల్ హెడ్ ప్రఫుల్ పాడే పాల్గొన్నారు. ఖచ్చితమైన న్యూస్ ను అందిస్తూ, వాటి వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతోన్న `హ్యాష్ ట్యాగ్ యూ` వెబ్ సైట్ గుడ్ విల్ ను సీఎం భూపేష్ ప్రశంసించారు. వెబ్ సైట్ ప్రారంభానికి ముందే సంచలన న్యూస్ ను అందచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ`చత్తీస్ గడ్ ప్రజల మన్ననలతో పాటు హిందీ రీడర్ల మనుసు హత్తుకునే న్యూస్ అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ప్రతిభ ఉన్న జర్నలిస్ట్ లతో దినేష్ టీమ్‌ సమాజానికి ఉపయోగపడేలా ప్రజలకు న్యూస్ అందుతుందని ఆయన అన్నారు. సంచలనాలతో పాటు నిజాలను సరైన సమయంలో ఇస్తుందన్న నమ్మకం ఈ వెబ్ సైట్ మీద ఉందని కొనియాడారు. యంగ్ జర్నలిస్ట్ గా చత్తీస్ గడ్ లో పనిచేసిన దినేష్ పదునైన పదాలతో జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ` వెబ్ సైట్ ద్వారా సంచలనాలను దినేష్ టీమ్ సృష్టిస్తోందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే తెలుగు `హ్యాష్ ట్యాగ్ యూ` వెబ్ సైట్ ద్వారా గుడ్ విల్ పొందారని అన్నారు. రాబోవు రోజుల్లో హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ` విజయవంతం అవుతుందని అన్నారు. `అనతి కాలంలోనే `హ్యాష్ ట్యాగ్ యూ` తెలుగు వెబ్ సైట్ సంచలనాలను సృష్టించింది. ప్రజాదరణను అందుకుంటోంది. ఏడాది కాలంలోనే తెలుగు రీడర్ల మన్ననలను అందుకుంది. వాళ్ల మనసులను హత్తుకుంది.` తెలుగు జర్నలిజం రంగంలో సింహభాగాన నిలుస్తూ సంచలన కథనాలను ఇస్తోన్న `హ్యాష్ ట్యాగ్ యూ` వ్యవస్థాపకులు, సీఈవో దినేష్ కృషిని సీఎం భూపేష్ ప్రశంసించారు. రాబోవు రోజుల్లో `హ్యాష్ ట్యాగ్ యూ` విస్తరించే క్రమాన్ని సీఎం వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)