ఢిల్లీలో మహిళ స్కూటీని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమానవీయ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఈ క్రూరమైన చర్యకు దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర మద్దతు, భరోసా అందిస్తాం. కానీ ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరం మంచి సమాజం కోసం కలిసి పనిచేద్దాం అని సక్సేనా అన్నారు. కాగా ఆ ఘటనకు కారణమైన కారుని స్వాధీనం చేసుకోవడంగాక ఆ ఐదుగురు నిందితులను వారి నివాసాల నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు నిందితులను అదుపులోకి తీసకున్నారని, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఆగ్రహం !
January 02, 2023
0
Tags