ఢిల్లీని చలి వణికిస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత సీజన్‌లో అత్యల్పంగా మూడు డిగ్రీలకు పడిపోయింది. గత రెండేళ్లలో జనవరిలో డిల్లీలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీలుగా ఉండగా, మంగళవారం 8.5 డిగ్రీలుగా ఉంది. తీవ్రమైన చలిగాలులకు ఢిల్లీ ప్రజలు నివాసాలకే పరిమితమయ్యారు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఉదయం 5.30 గంటలకు విజిబిలిటీ 50 మీటర్లుగా నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. లోథిరోడ్, అయానగర్, రిడ్జ్‌లోని వాతావరణ నమోదు కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 2.8 డిగ్రీలు, 2.2 డిగ్రీలు, 2.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి కారణంగా పవర్ గ్రిడ్‌లు దెబ్బతినడం వంటి సవాళ్లు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. మరో నాలుగు రోజులు ఇవే పరిస్థితులు ఉండవచ్చని ఐఎండి అంచనావేసింది. పంజాబ్‌లోనూ దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
ఢిల్లీని వణికిస్తున్న చలి !
January 05, 2023
0
Tags